29 April, 2026 | 6:08 PM

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పై చేయి

29-04-2026 02:19 PM

హైదరాబాద్: తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు(Telangana SSC Results) విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికల్లో 96.26 శాతం, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించారు.  5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా,  ఆరు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం ఉత్తీర్ణత,అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 89.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు results.bse.telangana.org, results.bse.telangana.gov.in, bse.telangana.gov.in, schooledu.telangana.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 'మీసేవ'(8096958096) వాట్సాప్ చాట్‌ ద్వారా కూడా ఫలితాలను పొందే సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా విద్యార్థులు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2:30 గంటల నుండి తమ మార్కుల మెమోను నేరుగా తమ ఫోన్లలోనే పొందవచ్చు.