calender_icon.png 9 December, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజే రూ.1.88 లక్షల కోట్లు

09-12-2025 02:36:40 AM

  1. ‘ట్రంప్ మీడియా’ లక్షకోట్లు : స్వైడర్ ఎరిక్
  2. ఆదానీ.. రూ.25వేల కోట్లతో గ్రీన్‌డేటా సెంటర్ ఏర్పాటు
  3. వంతారా ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ జూపార్కు
  4. వివిధ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు
  5. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చారిత్రాత్మక విజయాలు
  6. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పెట్టుబడులు

హైదరాబాద్, డిసెంబర్ ౮ (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం రోజునే రాష్ట్రానికి చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులు సమీకరించడంలో ప్రభుత్వం ఘన విజయం సాధించింది. తొలిరోజే మొత్తం రూ. 1.88 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన 35కు పైగా కీలక ఎంవోయూలు కుదిరాయి. ఇది తెలంగాణ 2047 విజన్‌కు గట్టి మద్దతుగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో జరిగిన ఈ సమ్మిట్‌లో డీప్‌టెక్ , గ్రీన్ ఎనర్జీ, వ్యూహాత్మకంగా తయారీ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణను జాతీయ ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఈ పెట్టుబడులు కీలకం కానున్నాయి. 

తెలంగాణ రైజింగ్ సమ్మిట్ - 2047 విజన్ అమలుకు వేదిక.. 

ఈ సమిట్ ద్వారా క్యూర్ (నగర), ప్యూర్ (పెరి-అర్బన్), రేర్  (గ్రామీణ, వ్యవసాయ) ఆర్థిక ఇంజిన్ల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలి రోజే వచ్చిన ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధి బాటకు గ్లోబల్ స్థాయి మద్దతుగా నిలిచాయి.

తెలంగాణకు పెట్టుబడులు.. మా పాలనపై నమ్మకమే : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ .. “తొలి రోజే రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం తెలంగాణ పాలనపై దేశ, విదేశీ పెట్టుబడీదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. 2047 విజన్ లక్ష్యంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు దిశగా ముందుకెళ్తామన్నారు. ప్రతి రూపాయీ ఉద్యోగ సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న వివిధ కంపెనీలు.. 

* రూ.1.04 లక్షల కోట్లు - డీప్‌టెక్, ఫ్యూచర్ సిటీ, మౌలిక వసతులు

* బ్రూక్‌ఫీల్డ్/యాక్సిస్ వెంచర్స్ కన్సార్షియంకు చెందిన రూ.75వేల కోట్ల ఒప్పందం

* ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా నెట్‌జీరో డీప్‌టెక్ నగర నిర్మాణం

* విన్ గ్రూప్ రూ.27వేల కోట్లు 

* పునర్వినియోగ విద్యుత్, ఈవీ మౌలిక వసతులు, స్మార్ట్ అర్బన్ ప్రణాళికలు

* సిడ్బీ స్టార్టప్ ఫండ్ రూ.1,000 కోట్లు.

* వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫ్యూచర్ సిటీ రూ.1,000 కోట్లు 

* ‘వాక్ టు వర్క్’ ఇన్నోవేషన్ హబ్

* రూ.39,700 కోట్లు -  గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ భద్రత

* ఎవ్రెన్/యాక్సిస్ ఎనర్జీ - రూ.31,500 కోట్లు - సోలార్, విండ్ మెగాప్రాజెక్టులు.

* ఎంఈఐఎల్ (మెయిల్ ) గ్రూప్ రూ.8,000 కోట్లు  -  సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు

* రూ.19,350 కోట్లు  -  ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్

* జీఎంఆర్ గ్రూప్ రూ.15,000 కోట్లు  - ఏరోస్పేస్, ఎంఆర్‌ఓ, కార్గో మౌలిక వసతులు

* అపోలో మైక్రోసిస్టమ్స్, సోలార్ ఏరోస్పేస్ రూ.3,000 కోట్లు - రక్షణ పరికరాల తయారీ

* ఎంపీఎల్ లాజిస్టిక్స్ రూ.700 కోట్లు, టీవీఎస్ ఐఎల్పీ రూ.200 కోట్లు - వేర్‌హౌసింగ్, ఇండస్ట్రియల్ పార్కులు

* రూ.13,500 కోట్లు - అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కోర్ ఇండస్ట్రీ

* ఎలక్ట్రానిక్స్ రంగం రూ.7,000 కోట్లు - పీసీబీ, ప్రత్యేక భాగాల తయారీ (రిన్యూసిస్, మిడ్‌వెస్ట్, అక్షత్ గ్రీన్‌టెక్).

* సోహీటెక్ ఇండియా రూ.1,000 కోట్లు - హైడ్రోజన్ టెక్నాలజీ

* కృష్ణా పవర్ యుటిలిటీస్ రూ. 5,000 కోట్లు - సమగ్ర ఉక్కు కర్మాగారం

* సిమెంట్ రంగం రూ.2,000 కోట్లు - అల్ట్రా బ్రైట్, రైన్ సిమెంట్స్.

* సీతారాం స్పిన్నర్స్ రూ.3,000 కోట్లు - టెక్స్‌టైల్ యూనిట్.

* టెక్స్‌టైల్ సంఘాలు కలిపి రూ.960 కోట్లు

ఫ్యూచర్‌సిటీలో ‘ట్రూత్’ లక్షకోట్ల పెట్టుబడి :  ట్రంప్ మీడియా టెక్నాలజీస్‌డైరెక్టర్ ఎరిక్ 

 ‘రాబోయే పదేళ్లలో తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులను ట్రంప్ మీడియా పెడుతుందని, వీటిని ఫ్యూచర్‌సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ, ఇతర రంగాల్లో  పెడతామని ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్  తెలిపారు. టెక్నాలజీ రంగంలో ప్రపంచానికి ఇండి యానే పెద్దన్నలా ఉంది. భారత్‌లో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికే పెట్టుబడుల వరద పోటెత్తుంది’ అని అన్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛకే ట్రూత్ సోషల్ మీడియాను ఏర్పాటు చేశామని, అభివృద్ధిలో దీర్ఘకాలిక అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. తెలంగాణ గ్లోబల్ స మ్మిట్ రైజింగ్‌కు ‘నన్ను ఆహ్వానించినందుకు, మహా ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎరిక్ స్వైడ ర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్నగా కనబడుతోందని ఎరిక్ వివరించారు. 

తెలంగాణలో కొత్త అంతర్జాతీయ జూ

ప్రభుత్వం నిర్ణయించిన నాల్గో నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా జూ ఏర్పాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మరో సారథ్యమైన అడుగు వేసింది. ముఖేష్ అంబానీకి చెందిన వంతరా జూ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో తెలం గాణలో ఏర్పడబోయే కొత్త జూ దేశంలోనే కాక ఆసియా స్థాయిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిణి డాక్టర్ సి సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ సునీత భగవత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అన్ని జిల్లాల్లో పరిశ్రమ అభివృద్ధే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు  

డీప్‌టెక్ సిటీ నుంచి టెక్స్‌టైల్ పరిశ్రమ వరకూ విస్తృత రంగాల్లో వచ్చిన పెట్టుబడులు తెలంగాణ పరిశ్రమల విధానానికి గ్లోబల్ గుర్తింపునిచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధే మా లక్ష్యమని తెనలిపారు. ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతు ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు బలమైన నిర్ధారణ అని త్వరితగతిన డీపీఆర్‌లు సిద్ధం చేసి, ప్రాజెక్టులు అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

రూ.25వేల కోట్లతో గ్రీన్‌డేటా సెంటర్ : కరణ్ ఆదానీ

తెలంగాణలో ఇప్పటికే ఆదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ కుమారుడు కరణ్ గౌతమ్ ఆదానీ అన్నారు. గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామని వెల్ల డించారు. తెలంగాణలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లాజిస్టిక్స్‌లో తెలంగాణ రాష్ట్రా న్ని నంబర్ వన్‌గా నిలిపేందుకు ఆదానీ గ్రూప్ ప్రయత్నిస్తోందని కరణ్ ఆదానీ అన్నారు.