calender_icon.png 9 December, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

09-12-2025 06:35:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో 15 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్ అధికారులు, రహదారులు భవనాల శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.