09-12-2025 06:33:23 PM
రోగులకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఘట్ కేసర్ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ ఘట్ కేసర్ పట్టణంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చెందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి రెహమాన్, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకటనారాయణ ముదిరాజ్, కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖయ్యూమ్, సీనియర్ నాయకులు కె. నర్సింగ్ రావు, మెట్టు రమేష్, తోక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.