రాష్ట్రంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్: ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రోణి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకొని కేరళ తీరం వెంబడి వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. దీం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి మోస్తారు వానాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది.
ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వానాలు పడుతున్నాయి.
రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని అధికారులు తెలిపారు. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర ఉండరాదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.






