27 June, 2026 | 1:33 AM

లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి

27-06-2026 12:00 AM
  1. ఎంఎస్ చదివేందుకు వెళ్లిన కామారెడ్డి జిల్లా తలమడ్ల నివాసి శ్రీనాథ్‌రెడ్డి 
  2. మిత్రుడి బర్త్‌డేలో పాల్గొని అక్కడే నిద్ర.. మృతి!

కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని మధుసూదన్‌రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్‌రెడ్డి(25) 14 నెలల క్రితం లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. లండన్‌లోని లీ సేస్టర్ పట్టణంలోని యూనివర్సిటీలో ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం శ్రీనాథ్‌రెడ్డి తన మిత్రుడి బర్త్‌డే ఉండటంతో అతని గదికి వెళ్లాడు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనాథ్‌రెడ్డి అక్కడే నిద్రించాడు. ఉదయం స్నేహితుడు వచ్చి చూసేసరికి విగత జీవిగా ఉన్నాడు. స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనాథ్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేలా అక్కడ ఉన్న మిత్రులు కృషి చేస్తున్నట్లు సమాచారం. హత్య, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.