27 June, 2026 | 1:33 AM

నల్లపోచమ్మ ఆలయంలో కన్నుల పండువగా మొదటి వార్షికోత్సవం

27-06-2026 12:00 AM

రాజేంద్రనగర్, జూన్ 26 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్ ఇందిరా కాలనీ  శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో  తొలి వార్షికోత్సవ వేడుకలు గత రెండు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగాయి. మాజీ కార్పొరేటర్ గోకరి శ్రీలత, ఆలయ చైర్మన్ సురేష్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన, అభిషేకం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నులపండువగా జరిగాయి. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం నిర్వాహకులు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ పరిధిలోని పలు కాలనీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.