09-11-2025 08:04:20 PM
ప్రెసిడెంట్‌గా తుమ్మ స్వాతి..
నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్..
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీ ఫేజ్-2 ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఏకగ్రీవంగా లేడీ ప్రెసిడెంట్‌గా తుమ్మ స్వాతిని కాలనీ వాసులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ పాల్గొని నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తుమ్మ స్వాతి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.