calender_icon.png 9 November, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలభైరవ స్వామి ఉత్సవాలు ప్రారంభం

09-11-2025 08:00:34 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసనపల్లి గ్రామాలలో వెలసిన కాలభైరవ స్వామి జన్మదిన ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గురువారం వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈవో ప్రభు తెలిపారు. బద్ది పోచమ్మ బోనాలు కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. సోమవారం లక్షదీపార్చన, మంగళవారం కాలభైరవుని డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్ష యజ్ఞము, అగ్ని గుండాలు, బండ్ల ప్రదర్శన, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో  కాలభైరవ స్వామి జన్మదిన ఉత్సవాలలో పాల్గొనాలని ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా, అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.