calender_icon.png 9 November, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడీకి తొందరలో ముగింపు పలుకుతాం

09-11-2025 08:12:29 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పవిత్ర యాదాద్రి ఆలయంలో ఇటీవల బయటపడుతున్న అవినీతి అక్రమ వ్యవహారాలు భక్తుల హృదయాలను, స్థానికులు కలిసి వేస్తున్నాయి. దేవాలయ సంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియలను అంగీకరించలేమని, ఈ అవకతవకలు వెంటనే నిలిపివేయాలని, ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఉపయోగించవద్దని, ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖకు కఠినంగా హెచ్చరిస్తున్నామని, ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసి డిఇఓ, ఏఈ స్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు స్వామి వారిని తీసుకెళ్లి ప్రైవేట్ కార్యక్రమాలను నిర్వహించడం ప్రచారం పేరుతో నెలలు నెలలుగా విదేశాలతో ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అర్చకులు విదేశాలకు వెళ్లడం ఏమిటని గతంలో దేవాలయ ఉద్యోగస్తుల మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని, మొన్నటికి మొన్న ఓ అధికారి లంచంతో పట్టుబడడంతో దేవస్థాన అధికారుల పద్ధతి తీరు అందరికీ తెలిసిందని, దేవస్థాన కైంకర్యాల టికెట్ బ్లాక్లో అమ్మే పరిస్థితికి దిగజారిందని పర్యవేక్షణ లోపం వలన అవినీతికి అంతులేకుండా పోయిందని యాదగిరిగుట్ట మండల బిజెపి అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఉండేలా చూడాలని వినతిపత్రం ఆలయ ఈవోకి అందజేయడం జరిగింది.