కెనడాలో తెలుగు విద్యార్థి ఘనత
29-10-2024 08:30 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఏడు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ లో గీతం యూనివర్సిటీ టాపర్ గా మానాప్రగడ సాయికృష్ణ సందీప్ నిలిచాడు. విద్య మీద ఉన్న మమకారంతో ఇండియాలో ఎల్ అండ్ టీలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని మరీ కెనడాలో ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ లో వాటర్ లూ విశ్వవిద్యాలయ టాపర్ గా నిలిచాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ సందీప్ కెనడాలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఎవరి మీదా ఆధారపడకుండా ఇంజనీరింగ్ మాస్టర్స్ లో యూనివర్శిటీ టాపర్ గా నిలవడం దేశానికే గర్వకారణం.




