ఆలయ భూమిని కాపాడాలి
ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతి
ఆమనగల్లు, జులై 6 (విజయక్రాంతి): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు నవచైతన్య కాలనీ సందబాయి సమీపంలో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామకంఠ భూమిలో తరాలుగా తాము ఎల్లమ్మ తల్లిని ఆరాధిస్తున్నామని, అయితే కొందరు కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
కొల్లూరు కృష్ణాదేవి అనే మహిళ ఉద్దేశపూర్వకంగా 12 మంది దళిత కుటుంబాలపై అక్రమ కేసులు పెట్టించి ఏడాదికాలంగా వే ధింపులకు గురిచేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమ్మ దేవస్థాన భూమి కబ్జా కాకుండా పరిరక్షించాలని, తమపై జరుగుతున్న అక్రమ వేధింపులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.






