13-08-2025 12:28:43 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు మంగళవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిం ది. అలాగే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కలిపి మొత్తం నాలుగు యూనిట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చింది. ఆయా యూనిట్లను నెలకొ ల్పేందు కు రూ.4,594 కోట్ల నిధులు కేటాయించింది. సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ దేశంలో ఊపందుకున్న వేళ కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆరు సెమీ కండక్టర్ యూనిట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయ. తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజె క్ట్‌లతో వాటి సంఖ్య 10కి చేరింది. న్యూఢిల్లీలో ప్ర ధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్యాబినేట్ పలు అంశాల పై నిర్ణయం తీసుకున్నది. 2034 నాటికి ఈ సెమీకండక్టర్ యూనిట్ల ద్వారా వేలాది మంది నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
ప్రస్తు తం మార్కెట్‌లో టెలికాం, ఆటోమోటివ్, డే టా సెంటర్లు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, క న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌కు తగిన విధంగా సెమీ కండక్టర్ల యూనిట్ల నుంచి ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. ఆ వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వై ష్ణవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్, ఎలక్రానిక్ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నదని వెల్లడించారు.
11 ఏళ్ల తమ పాలనలో ఎలక్రానిక్స్ రంగం ఎనిమిది రెట్ల అభి వృద్ధి సాధించిందని తెలిపారు. అలాగే మొ బైల్ తయారీ యూనిట్ల సంఖ్య రెండు నుం చి 300కు చేరుకున్నదని వివరించారు. ఇక్క డ తయారైన మొబైల్స్ దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, మొబైల్ తయారీ రంగంలో 127 రెట్ల అభివృద్ధి సాధించామని తెలిపారు. ప్రస్తుతం మొబైల్ తయారీ వాణి జ్యం రూ.2 లక్షల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.
అంతేగాకుండా తమ ప్రభుత్వం చిప్ డిజైన్ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, అందుకు సంబంధించిన స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని ల క్నోలో మెట్రో రైలు సేవలకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగానే మె ట్రో ఫేజ్-1 పనులకు ఆమోదం తెలిపింది.
దీంతో లక్నోలో తొలిదశలో రూ.5,801 కో ట్లతో వ్యయంతో 11.65 కిలోమీటర్ల మేర ని ర్మాణ పనులు జరుగనున్నాయి. అలాగే అ రుణాచల్‌ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రాజెక్ట్ కింద రూ.8,146 కోట్లు కేటాయించనున్నది. ఈ పనులు ఆరేండ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నది.
ఏపీ మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు..
ఆంధ్రప్రదేశ్‌కు సెమీ కండక్టర్ల యూనిట్ కేటాయింపుపై ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మో దీకి కృతజ్ఞతలు తెలిపారు. యూనిట్ ఏర్పాటులో భాగంగా ఏపీ ప్రభు త్వం త్వరలో దక్షిణ కొరియాకు చెం దిన ఏపీఏసీటీ కో.లిమిటెడ్‌తో ఒ ప్పందం కుదుర్చుకుంటుందని స్ప ష్టం చేశారు. 96 మిలియన్ యూ నిట్ల వార్షిక సామర్థ్యంతో పరిశ్రమ నెలకొల్పుతామని వివరించారు. యూనిట్ ఆత్మనిర్భర భారత్‌కు ఎం తో దోహదపడుతుందని పేర్కొన్నారు.