నల్లవల్లిలో ఉద్రిక్తత
- డంపింగ్ యార్డు వద్దంటూ నిరసనలు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డితోపాటు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్టు
పటాన్‌చెరు/గుమ్మడిదల, ఫిబ్రవరి 5: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పరధిలోని ప్యారానగర్(సురారం) అట ప్రాంతంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు, పలు పార్టీల నా ముందునుంచీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా పలు సంఘాలు, నాయకులు నిరసనలు చేశారు.
మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయ పాటు తాజామాజీ ప్రజాప్రతినిధు యువజన సంఘాల నాయకులను పోలీసులు ఇండ్ల వద్దకు వెళ్లి ముందస్తు అరె చేసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం చిద్రుప్పకు తరలించారు.
ఆ తర్వాత ప్యారా 150 ఎకరాల్లో నిర్మించబోయే డంపింగ్‌యార్డుకు కోసం అవసరమైన సామగ్రిని జీహెచ్‌ఎంసీ అధికారులు టిప్పర్‌ల ద్వారా పోలీసుల పహారాలో తరలించారు. బుధవా ఉదయం డంపింగ్‌యార్డుకు వ్యతిరేకం జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. యువజన సం ప్రజలు ఆందోళణ చేశారు.
పోలీసులు వారిని అరెస్టు చేసి వివిద పోలీస్ స్టేషన్లకు తరలించారు. డంపింగ్‌యార్డు నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు దగ్గరగా ఉన్నదని, నిర్మాణం చేపట్టవద్దంటూ న ఎమ్మెల్యే సునితారెడ్డి నల్లవల్లికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె అక్క నర్సాపూర్, జిన్నారం, గుమ్మడిదల మం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
సునితారెడ్డితోపా జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, రామచంద్రాపురం బీఆర్‌ఎస్ నేత ఆదర్శ్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుట్టన ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్, ఫయాజ్ ఉన్నారు.
ఆందోళన నేపథ్యంలో పోలీసులు నల్లవల్లి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. నల్లవల్లి ప్రధాన ప్రవేశ మార్గంలో పోలీసులు భారీగా మొహరించారు. అన్నారం నుంచి నల్లవల్లి చౌరస్తా వరకు జాతీయ రహదారివెంట పోలీసులు మొహరించారు.






