calender_icon.png 12 February, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్రిక్తతలు.. వాగ్వాదాలు

12-02-2026 02:16:51 AM

  1. పలు చోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారని పలు పార్టీల మధ్య ఘర్షణలు
  2. జనగామాలో పోలీసులతో ఎమ్మెల్యే పల్లా వాగ్వాదం
  3. నల్లగొండలో మాజీ ఎమ్యెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆందోళన

విజయక్రాంతి, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  నల్లగొండలోని 32 డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వారిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో పోలీసులకు, బీఆ ర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ వ్యక్తిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధి లోని ఏడవ వార్డులో బీజేపీ అభ్యర్థి తరఫున డబ్బులు పం చుతున్నారని, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వార్డులో తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

నిబంధనలకు విరుద్ధంగా వార్డులో సంచరిస్తున్న బయటి ప్రాంతాల వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపిం చి వేశారు. జనగామ జిల్లా కేంద్రంలో స్థానికంగా ఓటు హక్కు లేని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డిలను పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. వారిని ఎలా అనుమతి ఇస్తున్నారని, స్థానికంగా ఓటు హక్కు ఉన్న తనను ఎందుకు అడ్డు కుంటున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణుల బైఠాయింపు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో పోలింగ్ బూత్‌లకు ఎమ్మెల్యే వెళ్లడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారుల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సేవ్ ఎల్లారెడ్డి అంటూ నినాదా లు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

డీజీపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో మీ పోలీసుల లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. పోలీసులు రంగంలో కి దిగి మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలను, శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

దొంగ ఓట్ల కలకలం

కామారెడ్డి పట్టణంలో దొంగ ఓట్లు కలకలం సృష్టించాయి. పట్టణంలోని 8వ వార్డులో ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అతన్ని పట్టుకుని బయటకు పంపించారు. 9వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచా రంతో బీజేపీ నాయకుల నిఘా పెట్టారు. దేవునిపల్లి గ్రామానికి  చెందిన ఓ వ్యక్తి దేవునిపల్లిలో ఓటు వినియోగించుకుని 9వ వార్డులో ఓటు వేయడానికి రావడంతో బీజేపీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అతడిని పట్టుకున్నాడు.దాంతో కాంగ్రెస్, బీజే పీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఇరువర్గాల దాడిలో పలువురికి గాయాలయ్యా యి. బీజేపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావం అయింది. దాంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 9వ వార్డులో సుమారు 150 మందిని ఓటరు లిస్టులో చేర్చారని, వారందరితో దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు.