10-12-2025 12:57:17 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంగ ళవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రి ల్ 16 వరకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కానీ, ఏప్రిల్ 2, 7వ తేదీ ల్లో నిర్వహించే భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే జరుగాయని తెలిపింది. ఒక్కో పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించిం ది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
పరీక్షల తేదీలు..
మార్చి 14న - తెలుగు
” 18న - హిందీ
” 23న - ఇంగ్లిష్
” 28న - గణితం
ఏప్రిల్ 2న - సైన్స్ పార్ట్ -1 (భౌతికశాస్త్రం)
” 7న - సైన్స్ పార్ట్ -2 (జీవశాస్త్రం )
” 13న - సాంఘికశాస్త్రం
” 15న - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
” 16న - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2

పరీక్షల తేదీలను సవరించాలి: ఎస్టీయూ
పదో తరగతి పరీక్షలు నెల రోజులకు పైగా నిర్వహించడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, జుట్టు గజేందర్ తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు అంటే 33 రోజులు నిర్వహించడం ప్రయోగాత్మకంగా ఉందని, సీబీఎస్ తరహాలో పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుందన్నారు. పరీక్షల టైమ్ టేబుల్‌ను సవరించి, పది రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్‌లో ఎండలు తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు పరీక్షలు రాయడంలో ఇబ్బంది పడుతారని తెలిపారు.