calender_icon.png 11 December, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు గౌరవం ఇవ్వాలని తెలీదా?

10-12-2025 01:59:15 AM

ఫొటోగ్రాఫర్లపై హార్థిక్ ఆగ్రహం

ముంబై, డిసెంబర్ 9 : ఆసియాకప్‌లో గాయపడి జట్టుకు దూరమైన హార్థిక్ పాండ్యా ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.మంగళవారం మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఈ ఆల్‌రౌండర్ మరో విషయం లో ఫొటోగ్రాఫర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా డు. తన గాళ్‌ఫ్రెండ్ మహికా శర్మకు ఎదురైన ఇబ్బంది గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ ఫైర్ అయ్యాడు. 

ఓ రెస్టారెంట్‌ను బయటకు వస్తూ కారు దగ్గరకు వెళుతున్న మహికాను కొందరు ఫొటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. ఆమె మెట్లు దిగి వస్తున్నప్పుడు తీయకూడని కోణంలో క్లిక్‌మనిపించడంతో మహికా అసౌకర్యానికి గురైంది. దీనిని ఉద్దేశిస్తూనే హార్థిక్ పోస్ట్ పెట్టాడు. ఒక మహిళను గౌరవించాలని తెలీదా.. ఇలాంటి ఫోటోలు తీసి ఆమెను ఇబ్బంది పెట్టడం సరైనది కాదంటూ రాసుకొచ్చాడు. మీ హెడ్‌లైన్స్ కోసం ఇతరును ఇబ్బం దికి గురి చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాలని వ్యాఖ్యానించాడు. 

మీడియా వ్యక్తులు పడే కష్టం తనకు తెలుసనీ, వారికి ఎప్పుడూ సహకరిస్తానని చెప్పిన పాండ్యా కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని కోరాడు. నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్థిక్ మహికాశర్మతో లవ్‌లో పడ్డాడు. ఇటీవలే వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తానే ఇన్‌స్టాలో పోస్ట్ చేసి రిలేషన్‌షిప్‌ను ధృవీకరించాడు.