09-12-2025 01:28:51 AM
నేడు సౌతాఫ్రికాతో తొలి టీ20
టెస్ట్ సిరీస్ పరాభవం నుంచి కోలుకుని వన్డే సిరీస్ గెలిచి దెబ్బకొట్టిన టీమిండియా ఇప్పుడు సఫారీలతో ధనాధన్ పోరుకు రెడీ అయిపోయింది. టీ20 ప్రపంచకప్‌కు సెమీఫైనల్ ప్రిపరేషన్‌లో భావిస్తున్న ఈ సిరీస్‌తో టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్‌పై కన్నేసింది. అటు టీ20 స్టార్స్‌తో నిండిన సఫారీలు కూడా దుమ్మురేపేందుకు సిద్ధమవడంతో అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయం.
కటక్, డిసెంబర్ 8 : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇక ధనాధన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానులకు మరింత కిక్కిచ్చే టీ20 సిరీస్‌కు మంగళవారం నుంచే తెరలేవబోతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 కటక్ వేదికగా జరగబోతోంది. వన్డే సిరీస్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా తాము అదిరిపోయే ఫామ్‌లో ఉన్న షార్ట్ ఫార్మాట్‌లో దుమ్మురేపేందుకు ఎదురుచూస్తోంది.
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా పొట్టి క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది. ఇప్ప టి వరకూ ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పు డు సొంతగడ్డపై తమ డామినేషన్‌ను కంటి న్యూ చేస్తూ వచ్చే టీ20 ప్రపంచకప్‌కు టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లే మెగాటోర్నీకి ముందు భారత్ ఆడబోయేవి.
దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌లో మెరుగ్గా రాణించే ప్లేయర్స్‌కే దాదాపుగా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. కాగా తొలి టీ ట్వంటీ కోసం భారత జట్టులో పలు మార్పులు చో టు చేసుకున్నాయి. మెడనొప్పి నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేశాడు.
అలాగే హార్థిక్ పాండ్యా, బుమ్రా కూడా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. సంజూ శాంసన్‌కు నిరాశే మిగలనుం ది. కీపర్‌గా ఫినిషర్ రోల్‌కు సరిపోయే జితేశ్ శర్మకు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. తర్వాత హార్థిక్, దూబేలు బ్యాటిం గ్‌కు రానున్నారు. దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కి తే అతనే వస్తాడు. ఏడో స్థానంలో ఫినిషర్‌గా వికెట్ కీపర్ జితేశ్ శర్మ బరిలోకి దిగనున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీ ప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చోటు దక్కడం ఖా యం. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మా త్రం అక్షర్ పటేల్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు. పేస్ విభాగంలో హర్షిత్ రాణా కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తుండడంతో బుమ్రా, అర్షదీప్‌లతో పాటు అతనికి చోటు దక్కే అవకాశముంది.
అయితే మెగాటోర్నీకి ముం దు 10 మ్యాచ్‌లే మిగిలి ఉండడంతో ప్రిపరేషన్‌తో పాటు జట్టు కూర్పును కూడా దాదా పుగా ఖాయం చేసుకోవడంపై ఫోకస్ పెట్టిం ది. మరోవైపు సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. ఇక టీ20 స్పెషలిస్టులు సైతం సౌతాఫ్రికా జట్టు లో బాగానే ఉన్నారు.
మాక్‌ర్రమ్ మళ్లీ షార్ట్ ఫార్మాట్‌లో సఫారీ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. డికాక్, బ్రెవిస్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్స్ సౌతాఫ్రికాకు ప్రధాన బలం. ఏ విధంగా చూసినా టీ20 స్టార్స్‌తో నిండిన సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం.
గత రికార్డులు :
టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికాపై భారత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడితే భారత్ 18 మ్యాచ్‌లలోనూ, సౌతాఫ్రికా 12 మ్యాచ్‌లలోనూ గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్ :
బారాబతి స్టేడియంలోని పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ సారి మాత్రం రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేయడంతో భారీస్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. మంచు ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.
భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(కీపర్), బుమ్రా, హర్షిత్ రాణా, కుల్దీప్/వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)
డికాక్, మార్క్‌క్రమ్(కెప్టెన్), స్టబ్స్, మిల్లర్, బ్రెవిస్, డి జోర్జి, మార్కో యెన్సన్, కార్బిన్ బోస్చ్, కేశవ్ మహారాజ్, ఎంగిడి, నోర్జే