calender_icon.png 9 February, 2026 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి ‘పీఠం’ దక్కెదెవరికో?

09-02-2026 12:38:03 AM

కేసముద్రం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని తొలిసారిగా అధిష్టించే అదృష్టాన్ని దక్కించుకునే అవకాశం  కోసం పలువురు పోటీ పడుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని తొలిసారి ఎస్టి మహిళలకు కేటాయించారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా అందులో 8 వార్డులు మహిళలకు కేటాయించారు.

ఇందులో ఎస్టీ మహిళలకు 15వ వార్డు కేటాయించారు. అయితే చైర్ పర్సన్ పదవి ఎస్టీ మహిళలకు కేటాయించడంతో ఓసీ జనరల్/మహిళ కేటగిరిలో కేటా యించిన 1, 3, 5, 13, 14  వార్డుల్లో సైతం చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న వారు పోటీకి దిగారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చైర్ పర్సన్ పదవుల కోసం తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. 1వార్డులో జాటోతు సుజాత (బీఆర్‌ఎస్), బానోతు పద్మ (బీజేపీ), 2వ వార్డ్ లో బానోతు సునిత (కాంగ్రెస్), 3వ వార్డు లో ధరావత్ రంగమ్మ (బీజేపీ), 5వ వార్డు లో భానోత్ సునీత (బీజేపీ), 14వ వార్డులో భానోతు లక్ష్మి (కాంగ్రెస్), బానోతు అరుణకుమారి (బీఆర్‌ఎస్), బానోతు అనిత (ఇం డిపెండెంట్),

15వ వార్డులో గుగులోతు సునీత (బీఆర్‌ఎస్), బానోతు విజయ (కాంగ్రెస్), భానోతు శారద (బీజేపీ), 16 వార్డులో బానోతు నీలిమ (ఇండిపెండెంట్) చైర్ పర్స న్ పదవి కాంక్షిస్తూ ఎన్నికల బరిలో నిలిచారు. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ 9 వార్డులు గెలుచుకునే పార్టీకి చైర్పర్సన్ పదవి దక్కనుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా తమ ఓటు హక్కు ద్వారా మద్దతి ఇచ్చి తమ పార్టీకి చెందిన వారిని చైర్పర్సన్ పదవులకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

గ్రామాలుగా విడిపోయి.. మున్సిపాలిటీగా ఒక్కటై

చాలాకాలం కేసముద్రం గ్రామంగా ఉండగా, తర్వాత.. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్ గా ఏర్పడ్డాయి. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్లీ రెండు గ్రామాలు ఒక్కటై 2025లో కేసముద్రం విలేజ్, స్టేషన్ కాకుండా సరికొత్తగా ‘కేసముద్రం’ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి కేసముద్రం గ్రామాలతో పాటు అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి గత ఏడాది మున్సిపాలిటీగా కేసముద్రం ఏర్పడింది.