12 May, 2026 | 4:13 PM

30న టెన్త్ ఫలితాలు?

24-04-2024 01:48 AM

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈ నెల 30న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 30న లేదా అంతకంటే ముందే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు.