28 June, 2026 | 11:35 PM

నీట్‌ పరీక్ష రద్దు: కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. నేరం

12-05-2026 04:00 PM

న్యూఢిల్లీ: NEET UG 2026 పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి విద్యా వార్తలు కోసం మా ఎడ్యుకేషన్ విభాగాన్ని సందర్శించండి

నీట్ రద్దుతో 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని,  కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని వాపోయారు. కొందరు పేరెంట్స్‌ నగలు అమ్మి, అప్పులు చేసి తమ పిల్లలకు కోచింగ్ ఫీజులు కట్టి చదివించారని, లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా.? అని ప్రశ్నించారు. 

NEET పూర్తి వార్త: NEET UG 2026 రద్దు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని, ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. నేరం కూడా అని మండిపడ్డారు. విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే లీక్‌ అవుతుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.  ప్రతిసారీ పేపర్ మాఫియా శిక్ష లేకుండా తప్పించుకుంటోందని, చేయని తప్పునకు విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న అమృత కాలం యువత పాలిట విషతుల్యమైందని రాహుల్ ఎద్దేవా చేశారు.


ఇలాంటి విద్యా వార్తలు, తాజా అప్‌డేట్స్ కోసం మా విజయక్రాంతి న్యూస్‌ విభాగాన్ని ఫాలో అవ్వండి.



ఇవి కూడా చదవండి:

NEET-UG 2026 cancelled: కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

NEET Exam Cancelled 2026: విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం

విద్యార్థులకు భారీ షాక్: ప్రశ్నాపత్రం లీక్— దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు