12 May, 2026 | 3:48 PM

నిరూపయోగంగా త్రాగునీటి పరికరం

12-05-2026 03:18 PM

అసలే వేసవికాలం, చల్లటి నీరు ఎక్కడ..?

ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది చేసే పనితీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పోయేవారికి దాహార్తిని తీర్చే  వాటర్ డిస్పెన్సర్ ని (చల్లని వాటర్ ) ఇచ్చే  పరికరాన్ని ఉపయోగించవలసింది పోయి నిరుపయోగంగా కూలర్ క్రింద  సపోర్టుగా ఉపయోగిస్తున్నారు. ఇది ఎవరు గమనించకుండా ఉండడానికి దానిపైన  గుడ్డ కప్పి ఉంచారు.

ఆసుపత్రి వచ్చిన రోగులు  దీనిని చూసి  ఇంత వేసవి కాలంలో చల్లని నీరు ఇవ్వకపోగా, ప్రజల సొమ్ము ఇలా కూడా వృధా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే హాస్పిటల్ సిబ్బంది నిర్వాకం ఈ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది,  దీనిపైన అధికారులు వెంటనే స్పందించి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.