10 May, 2026 | 6:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

౩౦న టెన్త్ ఫలితాలు

25-04-2024 01:29 AM

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఇంటర్ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈమేరకు వెల్లడించారు. 30వ తేదీన ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, కోడింగ్ ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.