10 May, 2026 | 5:28 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలి

25-04-2024 01:31 AM

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : తాండూరు నియోజకవర్గం లో యాలాల మండలంలో బుధవా రం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధించేందుకు యూత్ కాంగ్రెస్ కీలకంగా పని చేసిందని గుర్తు చేశారు. వచ్చేనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ హైమాద్, కృష్ణంరాజు, చేవేళ్ల పార్లమెంట్ ఇన్‌ఛార్జి కావలి సంతోశ్, అసెంబ్లీ ఇన్‌ఛార్జి బస్వరాజ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.