23 April, 2026 | 4:59 AM

జనవరి 2 నుంచి టెట్

19-12-2024 01:41 AM

రోజూ రెండు సెషన్లలో పరీక్షలు

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ప్రకటించారు. మొత్తం పది రోజులు.. ప్రతి రోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. సెషన్-1 ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు.. సెషన్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

పూర్తిస్థాయి షెడ్యూల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబా టులో ఉంచినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. పేపర్-1 పరీక్షలు జనవరి 8, 9 10, 18 తేదీల్లో.. పేపర్ పరీక్షలను 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో జరగనున్నట్టు వెల్లడించారు.

జనవరి 2న ఉద యం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్ (పేపర్ పరీక్ష, 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్ (పేపర్-2), మధ్యాహ్నం సెషన్‌లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ (పేపర్-2) పరీక్షలు జరగనున్నాయి. లోకల్ జిల్లాల ఆధారం గా పరీక్షలను నిర్వహించనున్నారు.