టెట్ ఫలితాలు విడుదల
విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం
పేపర్ 67.13 శాతం
పేపర్ 34.18 శాతం ఉత్తీర్ణత
అర్హత సాధించనివారికి వచ్చే సంవత్సరం టెట్‌కు ఉచితంగా దరఖాస్తుకు అవకాశం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో కలిసి విడుదల చేశారు. పేపర్ 67.13 శాతం మంది, పేపర్ 34.18 శాతం మంది ఉత్తీర్ణుల య్యారు. టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించగా, మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. పేపర్ మొత్తం 99,961 మంది దరఖాస్తు చేసుకోగా 85,996 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,725 మంది అర్హత సాధించారు. పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌కు 99,968 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 79,138 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 29,601 (37.4%) మంది అర్హత సాధించారు. సాంఘిక శాస్త్రం సబ్జెక్టును 71,353 మంది పరీక్ష రాయగా, అందులో 21,842 (30.61%) మంది అర్హత సాధించారు. మొత్తంగా పేపర్ పరీక్షకు 1,50,491 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 51,443 (34.18%) మంది పాసయ్యారు.
దరఖాస్తుదారులకు ఉపశమనం
టెట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఈసారి టెట్ అర్హత సాధించని వారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. టెట్‌లో అర్హత సాధించిన వాళ్లు డీఎస్సీకి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. టెట్ ఫీజు పేపర్ రూ.1,000, పేపర్ రూ.1,000 గా నిర్ణయించడంతో ఫీజు తగ్గించాలని దరఖాస్తులు స్వీకరణ సమయంలో అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ వల్ల ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. ఈ క్రమంలో వచ్చే టెట్, డీఎస్సీకి ఫీజు రాయితీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే డీఎస్సీకు 2.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి వీరికి రిఫండ్ ఎలా చేస్తారనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
పేపర్-1లో టీచర్ల ఉత్తీర్ణత
దరఖాస్తులు హాజరైనవారు ఉత్తీర్ణత
9,754 6,449 5,113
పేపర్-2లో సోషల్‌లో టీచర్ల ఉత్తీర్ణత
దరఖాస్తులు హాజరైనవారు ఉత్తీర్ణత
16,462 11,468 5,128
పేపర్-2లో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో
టీచర్ల ఉత్తీర్ణత
దరఖాస్తులు హాజరైనవారు ఉత్తీర్ణత
22,379 15,302 7,826







