3 July, 2026 | 9:52 PM

Breaking News

ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •  

టెట్‌ను వాయిదా వేయాలి

03-12-2024 01:01 AM
  1. అదే రోజు నెట్ పరీక్ష
  2. ప్రభుత్వాన్ని కోరుతున్న అభ్యర్థులు

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష)ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ పరీక్షలు కూడా జనవరి 1 నుంచి 19 వరకు ఉన్నాయి. ఒకే తేదీల్లో టెట్, నెట్ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. టెట్ పరీక్షను వాయిదా వేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు ఇటీవలే ముగిసింది.