మే 10 వరకు జిల్లా కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు
29-04-2026 02:27 AM
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తాలను మే 10 కల్లా జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయ సంచాలకులు రమణ కుమార్ తెలిపారు. పార్ట్-1 కింద మొత్తం 1.35 కోట్ల ఉచిత పుస్తకాలు అవసరం కాగా, వీటిలో ఇప్పటికే 1.09 కోట్ల (80 శాతం) పుస్తకాలను జిల్లా కేంద్రాలకు సరఫరా చేశామని తెలిపారు. ఇక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో బహిరంగ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచుతామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.






