23 August, 2026 | 4:32 PM

టీజీ బీపాస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

22-05-2024 02:04 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (విజయక్రాంతి): గ్రేటర్‌లో టీజీ బీపాస్ కింద వచ్చిన బిల్డింగ్ అనుమతుల దరఖాస్తులలో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.  జీహెచ్‌ఎంసీ కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ అధికారులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు టీజీ బిపాస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.  అర్హత గల దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలో అఫ్రూవల్ చేయాలని సూచించారు.

ఏదో ఒక కారణంతో తిరస్కరించడం సరైంది కాదన్నారు. పెండింగ్ దరఖాస్తులను, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. వీటిలో షార్ట్ ఫాల్స్ రేజ్ అవుతున్నట్టు దృష్టికి వచ్చినట్టు హెచ్చరించారు. నాలుగు నెలలుగా షార్ట్ ఫాల్స్, రిజెక్ట్ చేసిన దరఖాస్తుల వివరాలు అందించాలన్నారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరును మెరుగుపర్చుకోవాల న్నారు. ఈ సందర్భంగా సర్కిళ్ల వారీగా షార్ట్ ఫాల్స్, రిజెక్ట్ దరఖాస్తుల వివరాలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు.

ఇన్‌స్టాంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టాంట్ అప్రూవల్ దరఖాస్తులను జాప్యం చేయొద్దన్నారు. కమర్షియల్ అనుమతులకు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆమోదించాలన్నారు. శిథిలావస్థ భవనాలను తక్షణమే గుర్తించాలన్నారు.   వర్షాలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సిపిలు ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.