04-02-2026 01:50:07 AM
ఖమ్మం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా డైరీని జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం సీపీ సునీల్ దత్‌కు, ఏసీపీ అడ్మిన్ రామనుజంకు, ఏసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావుకు, కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రకళకు, సీఐ స్వామిలకు అందజేశారు.
అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేలకొండపల్లి ప్రిన్సిపాల్ పరంజ్యోతికి, డిగ్రీ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, వెంకన్న, కళాశాల అధ్యాపకులకు అందజేశారు.
ఈ సందర్భంగా టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు పీఆర్సీ, హెల్త్ కార్డుకు సీపీఎస్‌కు సంబంధించిన అంశాల పురోగతిని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు, హౌస్ బిల్లింగ్ కోపరేటివ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.