15 April, 2026 | 12:28 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇంటి వద్దకే భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

28-02-2026 05:29 PM

దేవరకొండ,(విజయక్రాంతి): ఇంటి వద్దకే భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు  అందుతాయని దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. గోడపత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ... శ్రీరామనవమి సందర్భంగా శ్రీ భద్రాచల సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర కోటి గోటి ముత్యాల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

భద్రాచలం వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తలంబ్రాలు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరిలాల్ సెల్ నెంబర్ 9154298694కు సంప్రదించి రూ151 చెల్లిస్తే  బుకింగ్ చేసి రసీదు ఇస్తారని.. స్వామివారి  కళ్యాణం తర్వాత తలంబ్రాలు మీకు అందించబడును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి సైదులు లాజిస్టిక్స్ ఏటియం బద్రి,నారాయణ తెలిపారు, భక్తులకు సౌకర్యవంతంగా నమ్మకంగా సేవలు అందించడమే టీ జీ ఎస్ ఆర్ టి సి లక్ష్యం మని తెలిపారు,