calender_icon.png 30 July, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

29-07-2025 01:55:41 AM

విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు

మహబూబ్ నగర్ జూలై 28 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేస్తున్న   మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి గకి, అందుకు అన్ని విధాలా సహాయ సహాకారాలు  అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  కృతజ్ఞతలు తెలిపి,  ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. 

మహబూబ్ నగర్ నియోజకవర్గం, ధర్మాపూర్  లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో   ప్రారంభించనున్న జికె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ  కళాశాల ఏర్పాటుకు  అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా  మహబూబ్ నగర్ పట్టణం లోని తెలంగాణ చౌరస్తా లో జరిగిన కార్యక్రమంలో సీఎం, ఎమ్మెల్యే ల చిత్రపటానికి విద్యార్థులు, నాయకులు పాలాభిషేకం చేశారు.   

ఈ సందర్భంగా  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ చదువును మించిన సంపద ఏది ఉండదని,   ఎలాంటి సంపద అయినా ఏదో ఒకరోజు నాశనం అవుతుందని, కేవలం ఒక్క చదువు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు.  గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కాబట్టి  విద్య యొక్క ఆవశ్యకత తెలుసు కాబట్టి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని అందుకే మహబూబ్ నగర్ లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. 

డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మంచి సుపరిపాలన అందిస్తునే, మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజ్ మ రియు లా కళాశాల ను అలాగే ముఖ్యమంత్రిని ఒప్పించి ఐఐఐటి కళాశాల ను మహబూబ్ నగ ర్ కు మంజూరు చేయించారని ,

ఇప్పుడు మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని వి ధాలా కృషి చేశారని , ఎమ్మెల్యే విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతం గా  స్వాగతిస్తూ  ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు  తెలిపారు.   ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, గోపాల్ యాదవ్, రాఘవేందర్ రాజు, సిజె బెనహార్, సాయిబాబా, రాములు యాదవ్, అజ్మత్ అలి, అవేజ్, నాగరాజు, అలీం, దోమ పరమేశ్వ ర్, ఇసా ఆమోది, విద్యార్థి సంఘాల నాయకులు ఆయేషా, సంతోష్, సురేష్, మహ్మద్ ఫజల్, తదితరులుపాల్గొన్నారు.