17 April, 2026 | 7:27 PM

సమస్యలు పరిష్కరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు

11-06-2025 01:07 AM

డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసిన ఉద్యోగులు

హైదారాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపినందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ, ఆఫీసర్స్ కమిటీలను నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో జేఏసీ నాయకులు ముజీబ్, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, వెంకట్, రామారావు ఉన్నారు.