జనసేనాని పర్యటనకు సహరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
జనసేన రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ
హనుమకొండ, జూన్ 18(విజయ క్రాంతి): హన్మకొండ హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై తన అభిమాన హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిన విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే స్పందించి తానే స్వయంగా వచ్చి బుధవారం నిరంజన్ ను పరామర్శించారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు గాదె పృధ్వీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కోరికను మన్నించి, కుటుంబ సభ్యులతో నలభై నిమిషాలు గడిపారు అనంతరం వారికి ఉపాధి కల్పించి జీవనోపాధి కల్పించేందుకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నిరంజన్ ఆరోగ్యం బాగుండాలని వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారని,పవన్ కళ్యాణ్ ను నిరంజన్ అడిగిన వెంటనే ఒక ట్యాబు,ఇష్టపడిన ఒక కుక్క పిల్ల స్థానిక జనసేన నాయకుల ద్వారా రెండు గంటల్లోనే అందించారని,అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గడ్డం రాకేష్,ఆమంచ సునీల్,దినేష్,కొలిపాక వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






