అదే పింక్ ఎలిఫెంట్ లక్ష్యం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా యువ దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాకాస’. జీ స్టూడియోస్ సమ ర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్‌కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయ కుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. “ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే గత ఏడాది నిర్ణయించుకున్నాం. చలి కాలంలో రాత్రిపూట ఎక్కువగా షూటింగ్ చేశాం.
నయన్‌కు మంచి టాలెంట్ ఉంది. ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. నిహారిక చాలా సున్నితమైన వ్యక్తి. ఆమెకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. జనం పెట్టే డబ్బుకు సరిపడేలా న్యాయం చేయాలని మానస తపన పడుతుంటారు” అని తెలిపారు. కథానాయిక నయన్ సారిక మాట్లాడుతూ.. “నిహారికతో పనిచేస్తే అదృ ష్టం కలిసి వస్తుంది. మానసశర్మకు సినిమా పట్ల చాలా ఫోకస్, క్లారిటీ ఉంది.
నాకు సంగీత్‌తో ఉన్నంత ర్యాపో ఇంకా ఏ కో యాక్టర్ తోనూ లేదు. ‘రాకాస’ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అని చెప్పింది. దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ.. “నిహారిక మా లక్కీ ఛార్మ్. నిహారిక వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. సంగీత్ శోభన్ నా బలం” అన్నారు. నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు’ చేస్తున్నప్పుడు మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు. ‘రాకాస’ టైమ్‌లో ఇలాంటివి ఎందుకు ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘బరి’ చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు అంటున్నారు..
ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటా. నా ప్రతి సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటా. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ సమానమే. నయన్ చాలా మంచి వ్యక్తి. ‘రాకాస’ చిత్ర విజయంలో సంగీత్‌కు సింహభాగం దక్కుతుంది. మా పింక్ ఎలిఫెంట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ యదు వంశీ, నటుడు గెటప్ శ్రీను, మిగతా చిత్రబృందం కూడా మాట్లాడారు.




