రియల్ రేసర్లతో షూట్ చేశాం!
స్టార్ హీరో శర్వా.. ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ హై- ఆక్టేన్ రేసింగ్ డ్రామాను దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విలేకరులతో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
‘బైకర్’ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్‌లో కూడా షూట్ చేశాం. నాకు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అంటే ఇష్టం. నేను ఏం చేసినా కూడా ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్లనే షూట్ చేయగలను. బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. నాకు పర్సనల్‌గా ఆ ఎమోషన్ అంటే చాలా ఇ ష్టం. ఇందులో రేసింగ్‌తోపాటు చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్- మధ్య ఉండే ఎమోషన్ ఆడియన్స్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా రెండు టైమ్‌లైన్లలో జరుగుతుంది. 90స్‌లో టూ స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అవిప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. రేసింగ్ సీన్స్ ఇండోనేషియాలో షూట్ చేశాం. ఆ బైక్స్ అన్నీ మళ్లీ ఇండియాకు తీసుకురావడం కూడా పెద్ద ప్రాసెస్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి రేసర్స్‌ను రప్పించాం.
ఈ సినిమాలో రేసింగ్ సీక్వెన్సులను రి యల్ రేసర్లతో షూట్ చేశాం. షూట్ చేసినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఒక షాట్ చేసిన తర్వాత రెండు గంటలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేది. కేవలం యాక్షన్‌కే 60 రోజులకు పైగా సమయం పట్టింది.
ఇండియాలో ఈ స్పోర్ట్స్ ఉంది. కానీ రావాల్సిన పాపులారిటీ రాలేదు. ఇందులో రాజశేఖర్ క్యారెక్టర్‌తో ఇదే అంశాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. కానీ ఆయనకు క్రికెట్‌లో కపిల్ దేవ్‌కు వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు. ఈ రేసింగ్ స్పోర్ట్ మనకు ఎప్పటినుంచో ఉంది, కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ. కపిల్ దేవ్‌కు ఉన్నంత గుర్తింపు శ్యామ్ కొఠారికి కూడా రావాలనేదే నా మోటివ్. ఫిక్షనల్ స్టోరీ అయినా రేసింగ్‌లో కొన్ని వాస్తవ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకున్నాం. రాజశేఖర్ కోచ్, ఫాదర్ క్యారెక్టర్లలో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ రెగ్యులర్ ఫాదర్‌లా ఉండదు. ఆయన చుట్టూ ఒక కథ తిరుగుతుంది. ఆయన ఆ క్యారెక్టర్ చేయడంతో ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది.
ఇండోనేషియాలో క్లైమాక్స్‌ను షూట్ చేశాం. అక్కడ రేసింగ్ షూట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ వాళ్లే అక్కడ వద్దనుకున్నారు. అలాంటి లోకేషన్‌లో సెట్ వేసి మరీ చేశాం. ఎందుకంటే ఈ కథకు అలాంటి ప్రాంతం కావాలి.
శర్వా ఈ సినిమా కోసం ఆయన దాదాపు 23 కేజీలు తగ్గారు. కథ చెప్పినప్పుడే బైకర్ క్యారెక్టర్ ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఆయన ఈ సినిమా కోసం దాదాపు 6 నెలలు బ్రేక్ తీసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేరయ్యారు. ఆయన పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. శర్వా తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. సినిమాపై ఆయనకున్న నమ్మకంతోనే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పారు.
ప్రభాస్ ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందని చెప్పారు. ఆయన మా సినిమా కోసం ట్వీట్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. దిల్ రాజు కూడా చాలా చక్కగా తీశానని చెప్పారు. నా తర్వాతి సినిమా ఆయనతోనే చేస్తున్నా.




