28 July, 2026 | 2:07 AM

అది భూకబ్జాదారుల పనే

28-07-2026 01:21 AM
  1. 63 కోర్టు ధిక్కరణ కేసులు వేసింది వారే
  2. లోతుకుంటలో 10 వేల కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయత్నం
  3. సంధ్య శ్రీధర్‌రావు, నల్ల మల్లారెడ్డి, ముఖీమ్ ప్రభుత్వ భూములను ఆక్రమించారు
  4. హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): తనపై నమోదైన 63 కోర్టు ధిక్కరణ కేసులన్నీ భూకబ్జాదారులు, భూమాఫియా వర్గా లు దాఖలు చేసినవేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూ ర్తికి అనుగుణంగానే తన బాధ్యతలను నిర్వర్తించానని వెల్లడించారు. భూమాఫియా, ఆక్రమణదారులు తప్పుడు సమాచారం అం దించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. లోతుకుంటలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు.

ఆ సంస్థ ఎలాంటి అనుమతులు లే కుండా వారసత్వ రాతి నిర్మాణాలను పేల్చివేయడంతో పాటు వందలాది చెట్లను నరికి వేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చట్టప్రకారం చర్యలు చేపట్టిందని తెలిపారు. సదరు బిల్డర్ సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూ మిని ఆక్రమించారని, ఆ తర్వాత తనపైనే కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారని రంగనాథ్ పేర్కొన్నారు.

తనపై నమోదైన మొత్తం 63 కోర్టు ధిక్కరణ కేసుల వెనుక ప్రభావశీలమైన భూకబ్జాదారులే ఉన్నారని ఆరో పించారు. ఈ సందర్భంగా సంధ్య శ్రీధర్‌రావు, నల్ల మల్లారెడ్డి, ముఖీమ్ పేర్లను ప్రస్తావిస్తూ.. వారు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపించారు. న్యా యవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉం దని, తనపై నమోదైన ప్రతి కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా అదే నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలిపారు. గత రెండేళ్లలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా పరిరక్షించిందని ఆయన పేర్కొన్నారు.