calender_icon.png 31 July, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీలలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

30-07-2025 08:23:17 PM

శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కాలనీలలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ(BRS leader Shambipur Krishna) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, నాయకులు పలువురు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయా కాలనీలలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ల దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.