30-07-2025 08:21:20 PM
ఖమ్మం (విజయక్రాంతి): గత ఏడాది నవంబర్ లో విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్ కు చెందిన హోంగార్డు బాణాల రామచారికి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రముగా గాయపడి తన కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.15 లక్షల చెక్కును పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) చేతుల మీదుగా హోంగార్డుకు బుధవారం అందజేశారు.
కాలు కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్న హోంగార్డుకు పోలీస్ కమిషనర్ సూచనలతో వైరా ఎస్ఐ రామారావు చొరవ తీసుకుని విజయవాడకు చెందిన స్వచ్చంద సేవకుడు, రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో ఇటీవల అదునాతన కృత్రిమ కాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఏ సి పి సుశీల్ సింగ్, హోమ్ గార్డ్ ఆర్ ఐ సురేష్, వైరా ఎస్ ఐ రామారావు, హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంక శ్రీను, వెంకటేశ్వర్లు, డి రవిబాబు, సిహెచ్ నాగరాజు, డి రమేష్, రహీమ్, జి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.