విద్యుత్తు వాహనాల హవా

22-04-2024 12:21:20 AM

కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి 

l తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం  

l మార్కెట్‌లో కొత్త మోడళ్లలో వాహనాలు 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహ నాల హవా పెరిగింది. తక్కువ ఖర్చుతో అధిక దూరం ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో ప్రజలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ అం టూ బంక్‌ల ముందు పడిగాపులు కాసే రోజుల నుంచి విముక్తి పొందేలా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు మూడు చక్రాలు, నాలు గు చక్రాల వాహనాలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో డీజిల్, పెట్రోల్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక ఎలక్ట్రిక్ వాహనం కూడా అందుబాటులో ఉంచుకోవాలని వాహన వినియోదారులు ఆలోచిస్తున్నారు.

వారి అవసరాలకు అనుగుణ ంగా కంపెనీలు సైతం వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. టీఎస్ ఆర్టీసీ కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోంది. ఇలా విద్యుత్తు వాహనాల కొనుగోలు రోజురోజుకూ ఊపందుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో వాహ నాన్ని బట్టి రూ.60 వేల నుంచి రూ.25 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

వంద కిలోమీటర్లు మైలేజీ 

నేను త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేశాను. ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి. డీజిల్ బండి అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేవి. ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ ఖర్చుతో వాహనం నడుస్తుంది.           

 జగదీశ్, మహబూబ్‌నగర్