calender_icon.png 10 February, 2026 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలభారత సమ్మెను జయప్రదం చేయాలి

10-02-2026 12:00:00 AM

బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ పలు కార్మిక సం ఘాల దేశవ్యాప్త సమ్మె కార్యక్రమం పిలుపులో భాగంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన అఖిలభారత కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పలు కార్మిక సం ఘాల నేతలు కోరారు.

ఈ మేరకు సోమవారం బాగ్లింగంపల్లిలోని బీఆర్టియు రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను బిఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూని యన్ తెలంగాణ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ పలు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు కార్మిక సంఘాల నేతలతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మీడియా సమావేశంలో బిఆర్‌టియు హైదరాబాద్ విద్యార్థి సంఘం నాయకుడు టివి లక్ష్మణ్ కుమార్, స్కూల్ వ్యాన్ యూనియన్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్, మోటార్ ఫీల్ సం ఘం రాష్ట్ర నాయకుడు సాయికుమార్, ఆటో యూనియన్ సిటీ అధ్యక్షుడు నిరంజన్, నిమ్స్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూని యన్ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, ఆర్టీసీ ఓటర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారుతి, స్కూల్ వ్యాన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మోటార్ ఫీల్ స్కూల్ వ్యాన్ ఆటో టాక్స్ యూనియన్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.