calender_icon.png 10 February, 2026 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సమాఖ్య వాదం దేశ ప్రాంతీయ అభివృద్ధిలో అత్యంత కీలకం

10-02-2026 12:00:00 AM

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి

సికింద్రాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): ఆధునిక పరిపాలనలోని సంక్లిష్టతలకు అనుగుణంగా చట్ట పరమైన, పరిపా లనా పరమైన విధానాలనుఅభివృద్ధి చేయాల్సినఅవసరం ఎంతైనా ఉందని,ఆ దిశగా కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండ లి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర విభాగం,ఉస్మానియా యూనివర్సిటీ సెం టర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఓయూసీఐఎస్) భాగస్వామ్యం తో సమకాలీన భారత దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల పునర్నిర్మా ణం, నియోజకవర్గాల పునర్విభజన ఆర్థిక స మాఖ్యవాదం, ఒకే దేశంఒకే ఎన్నిక, డిజిటల్ గవర్నెన్స్‌అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులోని ప్రధానాంశాలైన నియోజకవర్గాల పునర్విభజన,ఆర్థిక సమాఖ్యవాదం భారత దేశ ప్రాంతీయ అభివృద్ధికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఎంచుకున్నందుకు రాజనీతి శాస్త్ర విభాగాన్ని అభినందించారు.

కార్య క్రమంలో ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ ఎం. కోదండరాం, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీడాక్టర్ చలమల్లవెంకటేశ్వర్లు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రాజకీయ విభాగం హెడ్ ప్రొఫెసర్ అఫ్రోజ్ ఆలం,రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్లతో పాటు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ప్రొఫెసర్ శ్రీలత, అధ్యాపకులు సబావత్ రవి,యం.రమణ పాటు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీ లనుంచి అనేక మంది పరిశోధక విద్యార్థులు హాజరయ్యారు.