06-02-2026 12:34:19 AM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ది బాగుచేసే పనికాదు.. చెడగొట్టే పనే అన్నారు. కెసిఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని ఆగం చేస్తున్నతన్నారు.
అభివృద్ధితో పాటు పదేండ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నారన్నారు. అభివృద్ధికి కేరఫ్ గా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మున్సిపాలిటీ ఎన్నికలలో పట్టం కట్టాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికి జ్ఞానం పెరుగుతది కానీ రేవంత్ కు ఉన్న జ్ఞానం పోయిందన్నారు.
సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నాడు అన్నారు. స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పొలుస్తూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ప్రజలు జాతిపిత అంటున్నాతన్నారు. రేవంత్ అజ్ఞానంతో జ్ఞానం ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా రేవంత్ శంకుస్థాపనలు చేశారన్నారు. కాంగ్రెస్ సభల్లో ఆయన రోత మాటలతో బి ఆర్ ఎస్ కు మరింత బలం పెరుగుతుందన్నారు. ఇల వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.