26 August, 2026 | 3:28 AM

కదం తొక్కిన కలం సైన్యం

26-08-2026 02:04 AM

జాగ కోసం జైలు భరో కైనా సిద్ధం

జర్నలిస్టుల పాదయాత్రకు ప్రెస్‌క్లబ్, పార్టీల సంఘీభావం

కారేపల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఇండ్లు, ఇండ్ల స్ధలాల కోసం జర్నలిస్టుల  కదం తొక్కారు. టీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రం కారేపల్లి చేరుకుంది.  కారేపల్లి జర్నలిస్టులు పాదయాత్రకు ఆపూర్వ స్వాగతం లభించింది. కొమరం భీం సెంటర్ లో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి ప్రారంభించిన పాదయాత్రకు కారేపల్లి ప్రెస్ క్లబ్ సంఘీభావం ప్రకటించింది.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టటం అభినందనీయమన్నారు. యూనియన్లకు అతీతంగా ఇండ్ల స్ధలాల పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శ కే.నరేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు సంఘీభావం తెల్పి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అండగా ఉంటామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బానోత్ రాంమ్మూర్తి, తోటకూరి రాంబాబు, ఇమ్మడి తిరుపతిరావు, అడ్డగొడ ఐలయ్య, దిశ కమిటీ సభ్యురాలు దారావత్ హేమలత లు మాట్లాడుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నేతృత్వంలో మండల విలేకరులకు ఇండ్ల స్ధలాల సాధిస్తామన్నారు.  బీఆర్‌ఎస్ నాయకులు హన్మకొండ రమేష్, రావూరి శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, అజ్మీర వీరన్న లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సీపీఐ నాయకులు బోళ్ల రామస్వామి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు గుమ్మడి సందీఫ్, గుగులోత్ తేజా, న్యూడెమోక్రసీ నాయకులు భూక్య శివానాయక్, అంబేదర్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆదెర్ల రాములు, బీఎస్పీ జిల్లా నాయకులు దామళ్ల సత్యనారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన పోరాటంలో వెన్నంటే ఉంటామన్నారు.

పాదయాత్ర బస్టాండ్ సెంటర్ లో మహాత్మగాంధీ విగ్రహం, అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈసందర్బంగా తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపిడీవో పద్మ లకు వినతిప్రతాలు అందజేశారు. 

జాగ కోసం జైల్ భరో కైనా సిద్దం

జర్నలిస్టుల ఇండ్ల జాగా కోసం జైల్ భరో కైనా సిద్దంని,  జర్నలిస్టుల న్యాయమైన ఇండ్ల స్ధలాల పోరాటం మహత్తరమైందని టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఖదీర్, కే.శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్ లు అన్నారు. పాదయాత్రను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పాదయాత్రం పార్టీలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాదని, సమస్యను పాలకుల దృష్టికి తీసుకరావటం, ప్రజాపాలకులపై ఒత్తిడి తేవటానికేనన్నారు.   

జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, షేక్ జానీ పాషా, టీబీటీఏ జిల్లా  ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికిరణ్, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు టిఎస్ చక్రవర్తి, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్  నలుబోలు మధుశ్రీ,  మారెడ్డి నాగేందర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు   ఎన్.డి కర్ణ, దగ్గుపాటి మాధవరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కొరకొప్పుల రాంబాబు, కారేపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తేళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి పాలిక శ్రీను, పగడాల నాగేశ్వపావు, టీడబ్ల్యూజేఎఫ్ మండల నాయకులు బోడ అశోక్, భాగం నాగేశ్వరరావు, గుడెళ్లి శ్రీనివాసరావు, తోగల సతీష్ పాల్గొన్నారు.