అరైవ్ ఉద్యమంగా సాగించాలి
డీజీపీ బీ శివధర్‌రెడ్డి
బెల్లంపల్లి, ఏప్రిల్ 12 : అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా సాగించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్వ హించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మల్టీజోన్-I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి మాట్లాడారు.
రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాకుండా ప్రభుత్వ సమగ్ర విధానంలో భాగమన్నారు. ప్రతి గ్రామంలో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉద్యమ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన డ్రైవర్లకు డీజీపీ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్(మంచిర్యాల), కిరణ్ కుమార్ (బెల్లంపల్లి), వెంకటేశ్వర్లు(జైపూర్), బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




