13 April, 2026 | 2:49 AM

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

13-04-2026 01:20 AM

జిల్లాలో 72.69 శాతం ఉత్తీర్ణత 

నిర్మల్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యా ర్థు లు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 12 మంది ప్రథమ సంవత్సరంలో 13 మంది రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు వివరించారు.

ఇంటర్ ఫస్టియర్ లో 52 91 మంది విద్యార్థులకు గాను 3885 మంది విద్యార్థులు, 5778 మంది విద్యార్థులకు 36 66 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 75.04, సెకండ్ ఇయర్ 62.93 ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 72.06, ద్వితీయ సంవత్సరంలో 53.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడి యట్ పేరిన విద్యార్థులు వెంటనే సప్లమెంటరీ పరీక్షకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..

పట్టణంలోని సోఫీ నగర్ టీఎస్ ఆర్ జె సి గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. కళాశాలలో ఎంపీసీ విభాగంలో సంధ్యారాణి 1000 మార్కులకు గాను 990 బైపీసీలో కీర్తన 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్లో రాజ్యలక్ష్మి 437 అపర్ణ శ్రీవిద్య నిఖిత 436 మార్కులు సాధించినట్లు తెలిపారు మొత్తం 100% ఫలితాలను సాధించినట్లు ఆయన వివరించారు. 

కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ..

నిర్మల్ జిల్లా దిల్వార్పూర్, నర్సాపూర్ జి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇంటర్లో జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో గ్రహకులు సాధిం చినట్లు ఎస్ ఓ లు అపర్ణ వీణ తెలిపారు. నర్సాపూర్ జిల్లా కీర్తన  958, కావేరి 959, అశ్విని 423, వర్ష 459 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో ప్రతిభ సాధించినట్లు తెలిపారు. అలాగే దిల్వార్పూర్‌లో కేజీబీవీ పాఠ శాలలో అర్చన 981, శైలజ 943, తాన్సీ 443, పూజ 459 మార్కులు సాధించినట్లు వారు తెలిపారు. విద్యార్థులకు సన్మానం చేశారు 

ఆదర్శ విద్యార్థుల ప్రతిభ..

జిల్లాలోని ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్లో ప్రతిభ సాధించినట్లు ప్రిన్సి పల్ రాజు తెలిపారు. కళాశాల చెందిన గోపాల్ 990 గోరకనాథ్ 98 మార్కులు సాధించినట్లు తెలిపారు 950 8 మంది విద్యార్థులకు మార్కులు రాగా ఫస్ట్ ఇయర్లో పలువురు విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు తెలిపారు