calender_icon.png 9 September, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా కప్ భారత్‌దే!

08-09-2025 01:12:51 AM

  1. డిఫెండింగ్ హాకీ చాంపియన్‌పై 4-1 తేడాతో గెలుపు
  2. ఫైనల్స్‌లో చిత్తుగా ఓడిన దక్షిణ కొరియా
  3. నాలుగోసారి కప్‌ను గెలుచుకున్న ఇండియా టీం
  4. వచ్చే ఏడాది బెల్జియం వేదికగా వరల్డ్ కప్ 

పాట్నా, సెప్టెంబర్ 7: బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఆసియా హాకీ కప్‌లో భారత్ సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను 4-1 తేడాతో చిత్తు చేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు ఆసియా హాకీ కప్‌ను గెలిచిన టీమిండియా ఈ గెలుపుతో నాలుగోసారి కూడా ఆసియా చాంపియన్‌గా అవతరించింది.

ఈ గెలుపుతో టీమిండియా నేరుగా హాకీ ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించింది. బెల్జియం వేదికగా 2026లో హాకీ వరల్డ్‌కప్‌ను నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. బెల్జియంలోని రెండు నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.