calender_icon.png 8 September, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గురి’ కుదిరింది

08-09-2025 01:03:42 AM

  1. ప్రపంచ ఆర్చరీలో భారత పురుషుల జట్టుకు తొలిసారి స్వర్ణం
  2. మిక్స్‌డ్ ఈవెంట్‌లో రజతం 
  3. మెరిసిన తెలుగుతేజం జ్యోతి సురేఖ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ వేదికగా జరుగుతున్న 2025 ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆర్చర్లు వావ్ అనిపించారు. ఏకంగా రెండు పతకాలను కైవసం చేసుకుని కొత్త చరిత్ర లిఖించారు. పురుషుల ఈవెంట్‌లో  స్వర్ణం, మిక్స్‌డ్ ఈవెంట్‌లో రజత పతకంతో మెరిశారు. పురుషుల జట్టు ఫైనల్లో ఫ్రాన్స్‌ను చిత్తు చేయగా.. మిక్స్‌డ్ ఈవెంట్‌లో తృటిలో స్వర్ణం చేజారింది.

మిక్స్‌డ్ ఈవెంట్ పోటీల్లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. జ్యోతి సురేఖ-రిషభ్ జోడీ నెదర్లా ండ్స్ జంటపై ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ ద్వయం 157 పాయింట్లతో నిలవగా జ్యోతి జోడీ 155 పాయింట్లతో నిలిచి తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయింది. ఫైనల్ పోరులో పురుషుల జట్టు 235-233 తేడా తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. దీంతో టీమిండియాకు స్వర్ణం ఖాయం అయింది.  

ఇదో సువర్ణాధ్యాయం

భారత ఆర్చరీ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం అని అంతా కీర్తిస్తున్నారు. భారత్ కు ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం రావడం ఇదే తొలిసారి. పురుషుల జట్టులో ప్రథమేశ్ ఫుగే, అమన్‌సైనీ, రిషభ్ యాదవ్ ఉన్నారు. జ్యోతితో కలిసి మిక్స్‌డ్ ఈవెంట్‌లో రజతం గెలుచుకున్న రిషభ్ పురుషుల జట్టు ఫైన ల్స్‌లో కసితో ఆడాడు. మిగతా ఇద్ద రు ఆటగాళ్లతో కలిసి భారత్‌కు స్వర్ణపతకం సాధించి పెట్టాడు. ఆర్చరీలో కొత్త చరిత్రకు నాంది పలికాడు.