28 April, 2026 | 3:30 PM

ఆర్ కృష్ణయ్యపై దాడి హేయమైన చర్య

11-05-2024 01:36 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి దేశానికి అవమానకరమని తెలంగాణ యాదవ సేన వైస్ చైర్మన్ ఉమాకాంత్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు ప్రవీణ్ జయరామ్ రాజు, రజక సంఘం నాయకుడు భరత్ పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పర్యటనలో ఉన్న కృష్ణయ్యపై పలువురు రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కృష్ణయ్యపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే శిక్షించాలని అన్నారు.