28 April, 2026 | 5:00 PM

Breaking News

అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •  

బీజేపీతోనే భవిష్యత్

11-05-2024 01:32 AM

లూటీలే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్

ఆర్‌ఆర్‌ఆర్‌లో మూడో ఆర్ రజాకార్ ట్యాక్స్

మోదీ గ్యారెంటీ అంటే పూర్తయ్యే గ్యారెంటీ

పాకిస్థాన్ పాట పాడుతున్న కాంగ్రెస్ పార్టీ

దేశంలో హిందువులను  రెండో స్థాయికి మార్చే కుట్ర

ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ తహతహ

నారాయణపేట, హైదరాబాద్ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ 

హైదరాబాద్/నారాయణపేట, మే 10 (విజయక్రాంతి): ప్రజాధనాన్ని లూటీ చేయటంలో కాంగ్రెస్ పార్టీకి గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ పన్ను విధిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇందులో మూడో ఆర్ అంటే రజాకార్ ట్యాక్స్ అని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటతోపాటు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సభల్లో ప్రసంగించారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ఓడించేందుకు ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని, బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత దేశం గెలుస్తుందని, దేశ ద్రోహులు తోక ముడుస్తారని అన్నారు. ఖచ్చితంగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల స్థాపనలో నేడు భారత్ సూపర్ పవర్‌గా ఉన్నదని తెలిపారు. ఉద్యోగం, స్టార్టప్స్, పరిశ్రమలు.. ఇదీ మోదీ ట్రాక్ రికార్డు అని అన్నారు.

అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ

దేశంలో మెజారిటీ వర్గమైన హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ పాట పాడుతున్నదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు  బేలో.. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని విమర్శించారు. అవినీతిలో కాంగ్రె స్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని ఆరోపించారు. మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధి గ్యారెంటీ అని.. కచ్చితంగా అమలయ్యే గ్యారెంటీ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో పెట్రేగిన ఉగ్రవాదం 

వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్‌దే రికార్డు అని మోదీ విమర్శించారు. ఆ పార్టీ పాలనలోనే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయని, దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు భయపడేవారిని పేర్కొన్నారు. భారతీయులపై కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ యువరాజు గురువు ప్రజలను ఆఫ్రికన్లు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని విభజించు పాలించాలనేది కాంగ్రెస్ విధానమని ఆరోపించారు. ‘మీ సంపదను లాక్కునేవారు కావాలా? కాపాడేవాళ్లు కావాలా? కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను కోరుకున్నట్లే.

యువరాజుకు ట్యూషన్ చెప్పే ఓ నేత రామనవమి చేసుకోవడం తప్పని చెప్పారు. రాముడి పూజ చేయడం తప్పా? దేశ ద్రోహమా? భారతదేశ మూల సిద్ధాంతాలకు కాంగ్రెస్ వ్యతిరేకం’ అని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవం నిర్వహించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నిరాకరించాయని.. బీజేపీ మాత్రమే నిర్వహించిందని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇచ్చి ఈ కులాలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. 

మోదీ మూడోసారి ప్రధాని కావాలి: కిషన్‌రెడ్డి 

మూడోసారి దేశానికి మోదీ ప్రధాని కావాలని అన్నివర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఏవి అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మీడియా మేనేజ్‌మెంట్, వీడియోల మార్ఫింగ్, తప్పుడు కథనాలతో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు.

ఆరు నెలలు గడిచినా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇతర ఏ గ్యారెంటీ అమలుకాలేదని ఆరోపించారు. భారతీయుల శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని చేవెళ్లి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశం, రాష్ట్రం బాగుండాలంటే బీజేపీని మరోసారి గెలిపించాలని కోరారు. గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం రజాకార్ల చేతిలో ఉందని బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత అన్నారు. ఎంఐఎం నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.  

డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ అయ్యింది

‘తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టగానే ఆర్‌ఆర్ ట్యాక్స్ మొదలు పెట్టింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ (ట్రిపుల్ ఆర్) ట్యాక్స్ కూడా ప్రారంభమైంది. మూడో ఆర్ అంటే రజాకార్ ట్యాక్స్. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధు లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకున్నది’ అని ప్రధాని మోదీ విమర్శించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవని ప్రధాని అన్నారు.

విద్యుత్తు కోతల కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, బీఆర్‌ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈసారి హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీని గెలిపిస్తే పాతబస్తీ రూపురేఖలు మారుస్తామని, అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకొంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపి రజాకార్ పార్టీకి అంతర్గతంగా సహకరిస్తున్నదని విమర్శించారు.